Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

నానీ




మనసు సునామీ తరంగమై
గుండె చుట్టు సుడి గుండమై

ఆలోచనలు అగ్ని పర్వతం లో
అట్టుడుకుతున్న లావా సెగ లై

నిశ్శబ్ద నిశ్చల సుషుప్త కాసారం లో
ఎగసి పడుతున్న ఉప్పెన కెరటమై

ఆ తలపులే నన్ను వెంటాడుతున్నాయ్ !!
ఆ జ్ఞాపకాలే నన్ను వేటాడుతున్నాయ్ !!!!

అవే నాకు శ్వాస గా
అదే నాకు ధ్యాస గా
జీవన గమనం దారి చూపుతోంది !!
బతుకు పయనం కొనసాగుతోంది !!!
అయినా
ఎక్కడో ఓ మూలన
ఒక చిరు వెలుగు లా
నా గత వైభవపు అనుభవాల ఆనవాళ్ళు
నా పాత వలువల సువాసనల కంపనాలు
నేను నాలో కట్టుకున్న కోటల శిథిలాలు
నాకు నేను అంటిపెట్టుకున్న భావ శకలాలు
నాలో రేపటి కి
ధైర్యరచన చేస్తున్నాయి !!
స్థైర్య సృజన కావిస్తున్నాయి !!!
అవును !!!
మొన్నటి
సంజీవెన్నెల ను మింగిన
నిన్నటి
చీకటి రాకాసిని
ప్రస్తుతం
క్షతగాత్రున్ని కదా
ఇవ్వాళ ఎదిరించ లేనుగాని
రేపటి జగతి కి నేనే కదా జీవం !!
రానున్నది నాదే కదా సామ్రాజ్యం !!!



నిరాకరణ